పయనించే సూర్యుడు జూన్ 2 (సూళ్లూరు పేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా తడ మండలంలోని పాత కాదలూరు గ్రామంలో నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు, ఈ ఉత్సవాలు గ్రామంలోని యువకులు అయినటువంటి BNR ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా వేలూరు శ్రావణ్ కుమార్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత బహుజనుల నాయకుడు కన్నంబాకం హరికృష్ణ, ఏడిపిఎస్ నాయకులు పేర్నాటి వెంకట రమణయ్య, కుక్క తోటి రవి మరియు గ్రామ పెద్దలు అంబురు సురేష్ తదితరులు పాల్గొన్నారు. అతిథులు మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన యువకులు BNR ఫ్రెండ్స్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ జయంతి ఉత్సవాలు సందర్భంగా గ్రామంలోని పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ లో అత్యధిక మార్కులు సాధించిన వారికి బహుమతి అందజేశారు, ఆటల పోటీలో గెలుపొందిన వారికి బహుమతి అందజేశారు, మహిళలకు రంగోలి పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు కన్నంభాకం హరికృష్ణ మాట్లాడుతూ చాలా సంవత్సరాల తర్వాత కాదులూరు గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించినందుకు మొదటిగా BNR యువతకు అభినందనలు తెలియజేస్తూ, ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మొట్ట మొదటిగా ఆశయం అందరికీ విద్య, చాలా ముఖ్యమని పేర్కొన్నారు , ఓటు హక్కు ద్వారా వెనుకబడిన వర్గాలు రాజ్యాధికారానికి చేరుకోవాలని అంబేద్కర్ అభిప్రాయపడ్డారు అని తెలిపారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాల దిశగా కాదలూరు గ్రామంలోని విద్యావంతులు యువకులు అంతా కలిసి ఐక్యతతో మరెన్నో కార్యక్రమాలు చేస్తూ అంబేద్కర్ ఆశయాలు దిశగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో BNR ఫ్రెండ్స్ కమిటీ సభ్యులు, పేర్నాటి పవన్,దార సుబ్రహ్మణ్యం, మల్చి వెంకట మహేష్, మావిళ్ళపాటి ధీరజ్, నత్తం విక్కీ, మావిళ్ళ పాటి సామ్యూల్, మావిళ్ళపాటి వినీత్ తదితరులు పాల్గొన్నారు