పయనించే సూర్యుడు జులై 8 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న 200 మంది విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్ పంపిణీ చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ మదన్‌మోహన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కళాశాలలో విద్యాభ్యాసం చేస్తున్న ప్రతి విద్యార్థికి తోడ్పాటుగా దాతల సహకారంతో ఉపయోగకరమైన నోట్‌బుక్స్ అందజేయడం జరిగిందన్నారు. అన్ని దానాల్లో విద్యాదానం అత్యంత గొప్పదని పేర్కొంటూ, ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదివి, తల్లిదండ్రులతో పాటు కళాశాలకు కూడా మంచి పేరు తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏవో మొహమ్మద్ ఇర్ఫాన్, అధ్యాపకులు అంజయ్య, వనిత, ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.