డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మికి ఘన వీడ్కోలు

ప్రజారోగ్య సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

పయనించే సూర్యుడు మే 31 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ నాగర్‌కర్నూల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DM&HO) డాక్టర్ కె.వి. స్వరాజ్యలక్ష్మి పదవీ విరమణ సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, మూడు దశాబ్దాలకు పైగా ప్రజారోగ్య రంగంలో ఆమె అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. కరోనా సమయంలోనూ, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణలోనూ ఆమె చూపిన అంకితభావం యువ వైద్యులకు ఆదర్శమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆమెను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు ఎల్.బి. శ్రీ దేవసహాయం, పి. అమరేందర్, ఇన్‌చార్జి డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ రవికుమార్ నాయక్, వైద్య అధికారులు, ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొని డాక్టర్ స్వరాజ్యలక్ష్మి సేవలను ప్రశంసిస్తూ ఆత్మీయ వీడ్కోలు పలికారు.