పయనించే సూర్యుడు న్యూస్, జూలై 04 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల (జూలై 1 నుంచి 31 వరకు) సందర్భంగా శుక్రవారం ప్రత్తిపాడులోని ఎంపిడీవో కార్యాలయం వద్ద నిర్వహించిన అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నేపథ్యంలో వైద్య,ఆరోగ్య శాఖ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. నియోజకవర్గంలో ఎవరూ డెంగ్యూ బారిన పడకుండా అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజల్లో డెంగ్యూపై విస్తృతంగా అవగాహన కల్పించడంతో పాటు, వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే సంబంధిత నిర్ధారణ పరీక్షలు నిర్వహించి సకాలంలో చికిత్స అందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జె సీతారామారావు,రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, ఎంపీడీవో ఎంవిఆర్ కుమార్‌బాబు, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ ప్రశాంతి, ప్రత్తిపాడు సీహెచ్‌సీ వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని,సుబ్బారెడ్డి సాగర్ చైర్మన్ ఇళ్ల అప్పారావు, మాజీ సర్పంచ్ యాళ్ల విశ్వేశ్వరరావు, మాజీ నీటి సంఘం అధ్యక్షుడు చెలంకూరి భాను, రాచపల్లి, మాజీ ఎంపీటీసీ చిలకమర్తి వీరభద్రం, పెద్దిపాలెం, శాంతి ఆశ్రమం వైద్యాధికారులు డాక్టర్ గీతా సుధ, డాక్టర్ యశస్వి, డాక్టర్ రాంకుమార్, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.