పయనించే సూర్యుడు న్యూస్ :31:నియోజకవర్గం స్టాప్ ప్రతినిధి :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం హైదరాబాద్లోని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, నివాసంలో వెల్జీపూరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, తంగళ్ళపల్లి నుండి ఇల్లంతకుంట వరకు. పి ఎం జి ఎస్ యు పథకం కింద రోడ్డు విస్తరణ ఆమోదం పొందినప్పటికీ, వెల్జీపూరం నుండి రహీంఖాన్ పేట వరకు పాత రోడ్డు పూర్తిగా దెబ్బ తినడంతో, మళ్లీ అధికారులు అంచనాలు సవరించి అనుమతుల కోసం తిరిగి పంపారు, కానీ 2022 సంవత్సరం నుండి అనుమతులు రాకపోవడంతో మధ్యలో నిలిచిపోయిన రహదారి పనులను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, సానుకూలంగా స్పందిస్తూ, ఈ విషయాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, దృష్టికి తీసుకువెళ్లి, రహదారి పనులు పునఃప్రారంభం అయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.తంగళ్ళపల్లి–ఇల్లంతకుంట రహదారి ప్రాంత ప్రజలకు ఎంతో కీలకమైనదని, ఈ రహదారి నిర్మాణం పూర్తయితే రవాణా సౌకర్యాలు మెరుగుపడి ప్రజలకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెల్జీపూరం గ్రామ సర్పంచ్ నాయిని నవీన్ కుమార్, మాజీ సర్పంచ్ గుండా వెంకన్న, ఏ ఎం సి డైరెక్టర్ కంకణాల రాంప్రసాద్, వార్డు సభ్యులు బొజ్జ శ్రీనివాస్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి గండికోట సురేష్, సీనియర్ నాయకులు చిలువేరు స్వామి రెడ్డి, సోమిరెడ్డి అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.