తండ్రి మృతితో బాధపడుతున్న నాగ భూషణంను పరామర్శించిన కూటమి నాయకులు

పయ నించే సూర్యుడు జులై 3 ముమ్మిడివరం ప్ర(తినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతు సంఘం కార్యదర్శి త్సవటపల్లి నాగ భూషణం తండ్రి వెంకటేశ్వర రావు ఇటీవల మృతి చెందారు. కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామానికి చెందిన వెంకటేశ్వర రావు మృతి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. గురువారం నాగ భూషణం కుటుంబ సభ్యులను కూటమి నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు నాగ భూషణం కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. పరామర్శించిన వారిలో ముమ్మిడివరం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఓగూరి భాగ్యశ్రీ, కాట్రేనికోన మండల జనసేన పార్టీ అధ్యక్షులు మోకా బాల ప్రసాద్, సొసైటీ చైర్‌పర్సన్‌లు నూకల మూర్తి, గంగుముళ్ళ రవి కుమార్, నాయకులు గోదాశి నాగేశ్వర రావు, కంచుస్తంభం సోనీ, అడపా సాయి, నంద్యాల తాతాజీ, గుద్దటి జమ్మి, నూకల దుర్గబాబు, గోలకోటి బుల్లి, బద్రి రమా, బీమాల సూరిబాబు తదితరులు ఉన్నారు.