03 Nov 2026 | 12:14 AM

తక్కెళ్ళపాడులో టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి 10 కుటుంబాల చేరికలు.

కూటమి ప్రభుత్వ విధానాలపై అసంతృప్తితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక _పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు _

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం నవంబర్ 2 జగ్గయ్యపేట.మండలం, తక్కెళ్ళపాడు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కూటమి ప్రభుత్వ విధానాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీడీపీకి చెందిన 10 కుటుంబాలు ఆదివారం రాత్రి గ్రామంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు._
ఈ సందర్భంగా నూతనంగా పార్టీలో చేరిన వారికి జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తామని తన్నీరు నాగేశ్వరరావు తెలిపారు. గ్రామస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు.
తక్కెళ్ళపాడులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి లభిస్తున్న ప్రజాదరణకు ఈ చేరికలు నిదర్శనంగా నిలిచాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో: 1. వింజమూరి భాస్కరరావు 2. వింజమూరి నాగేశ్వరరావు 3. వింజమూరి రాములు 4. ఆదిమళ్ళ పుల్లారావు 5. ఆదిమళ్ళ గోపి 6. ధారావత్ నాగబాబు
7. వింజమూరి అక్కులు 8. రేమిడాల శారమ్మ 9. ఆదిమల్ల లక్ష్మయ్య 10. వింజమూరి కాంత్రి కూమార్ ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మూడు స్వామి, ఆదిమల్ల ముత్యాలు (మాజీ సర్పంచ్), బజారు సాయి, భైరబోయిన బాబు, మద్దుల రామకృష్ణ, ఆదిమళ్ళ నాగయ్య (యేసోపు), తదితర స్థానిక నాయకులు, గ్రామ ప్రజలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.