తపస్ ఆధ్వర్యంలో బిజినపల్లి తహసిల్దార్‌కు వినతి పత్రం అందజేత

ఉపాధ్యాయ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి

పయనించే సూర్యుడు జులై 5 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల పలు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ శనివారం బిజినపల్లి మండల తహసిల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. భోజన విరామ సమయంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను ప్రభుత్వం అత్యవసరంగా పరిష్కరించాలని కోరారు. పీఆర్సీని వెంటనే అమలు చేయడం, పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను విడుదల చేయడం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడం, టెట్ మినహాయింపు కల్పించడం, ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు ఓటు హక్కు కల్పించడం, జీవో నెం.25ను సవరించడం, అలాగే పెండింగ్‌లో ఉన్న అన్ని ఉపాధ్యాయ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని వినతిపత్రంలో ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు దెంది రాజారెడ్డి, మండల అధ్యక్షుడు హరికృష్ణ ప్రసాద్, మండల ప్రధాన కార్యదర్శి హరీష్ కుమార్ రెడ్డి, మహిళా ఉపాధ్యాయులు సూర్యకళ, కిరణ్మయి, స్నేహలత, అరుణకుమారి, ఉపాధ్యాయులు విష్ణుమూర్తి, భాస్కర్ గౌడ్, వెంకటేష్, రామకృష్ణ, మహేష్ బాబు, శ్రీకాంత్, అశోక్, శ్రీనివాసులు, జిల్లా, మండల సంఘం బాధ్యులు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.