పయనించే సూర్యుడు న్యూస్ :మే 29,తల్లాడ రిపోర్టర్ ముస్లిం సోదరులు బక్రీద్ పర్వదిన వేడుకలను తల్లాడ మండలంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా తల్లాడ మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరుపుకున్నారు. ఒకరినొకరు అలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హిందూ, ముస్లిం భాయ్ భాయ్ అంటూ స్థానికులు వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మతసామరస్యానికి, స్నేహ సంబంధాలకు బక్రీద్ పండగ ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు షేక్. ఈసూబ్, అక్బర్, మస్తాన్, బాబు, గాలిబ్, సొందు, బాబా, లాల్ మియా, మెహరాజ్, డాక్టర్ సైదా, జి క్రియ , మున్నా, జానీ, అజీజ్, యాకూబ్ పాషా, ముజిద్ మౌళి సాబ్, చందు పాషా, ముస్తఫా, సలీం, అజీజ్, రఫీ, అలీ, నాగులు మీరా, అన్వర్, జాన్ పాషా, బారల్లి, బాజీ, నిజాముద్దీన్, మదర , దాదా, లాల్మియా, సమీర్ యాకూబ్ పాషా సుభాని, బడే మియా, జానీ,అబ్దుల్ రెహమాన్, చిన్నారులు పాల్గొన్నారు