తల్లాడ లో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103 వ జయంతి వేడుకలు

కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ చేసిన తెలుగు దేశం పార్టీ మండల నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ :మే 29, తల్లాడ రిపోర్టర్ మండల కేంద్రంలోని కల్లూరు రోడ్డు లో టీడిపి దిమ్మె వద్ద మాజీ ముఖ్య మంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 103 వ జన్మదిన వేడుకలు తల్లాడ మండల టీడిపి నాయకులు ఘనంగా జరిపారు.కేక్ కట్ చేసి ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపినారు. ఈ సందర్భంగా టీడిపి నాయకులు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. సినిమా రంగంలోనే కాకుండా రాజకీయాల్లోనూ సరికొత్త ప్రభంజన సృష్టించి తెలుగు జాతి ఖ్యాతి ని ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన మహోన్నత నేత అని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజం కోసం రూ ,, 2 కే కిలో బియ్యం , జనతా వస్త్రాలు, పక్క గృహాల వంటి విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైన పథకాలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు అని అన్నారు.

ఖమ్మం మహానాడు కి వెళ్ళిన టీడీపీ మండల నాయకులు

తల్లాడ లో ఎన్టీఆర్ జన్మదినం కేక్ కట్ చేసి అనంతరం ఖమ్మం లో జరిగే టీడీపీ మహానాడు కార్యక్రమం కి సప్తపది ఫంక్షన్ హాల్ లో ఆంధ్ర నుంచి జరిగే మహా నాడు లైవ్ కార్యక్రమం కి తల్లాడ మండల టీడిపి నాయకులు వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమం లో టీడీపీ మండల అధ్యక్షుడు సరికొండ.శ్రీనివాస రాజు, మాజీ వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి భద్ర రాజు, టీడిపి మండల నాయకులు రావూరి రవి ప్రసాద్,కూచిపూడి.వేంకటేశ్వర రావు,సురేష్ బాబు, పట్టణ అధ్యక్షుడు మొక్క క్రిష్ణర్జున్, నున్నా.శ్రీను, నారపోగు.ప్రసాద్, కంపాటి .రవి, నర్వనేని శంకర్రావు, తేలపుట్ట.వేంకటేశ్వర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కాపా రామారావు,నాయకులు ధగ్గుల.శ్రీనివాస రెడ్డి, రాము,తదితరులు పాల్గొన్నారు.