తాపీ మేస్త్రీల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా మాట్లాడటం సరికాదు

★ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి -28 గ్రేటర్ హైదరాబాదులో సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ సమ్మె చేస్తూ తాపీ మేస్త్రీలపై అనుచిత వాక్యాలు చేస్తూ మేస్త్రీల ఆత్మ గౌరవాన్ని కించపరుస్తూ తాపీ మేస్త్రి హఠావో సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ బచావో తాపీ మేస్త్రీలు దళారులు అనే నినాదంతో సమ్మె చేయడం సరికాదని భవన నిర్మాణ కార్మిక సమైక్య సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చిలువేరు స్వామి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ కు ఉన్న సమస్యల పైన,రేట్ల పెరుగుదల విషయమై,రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాల పైన సమ్మె చేయాలి కానీ తాపీ మేస్త్రీల మనోభావాలను దెబ్బతీసే విధంగా సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ సమ్మె చేయడం సరికాదన్నారు.కొంతమంది రాజకీయ నాయకుల తమ స్వలాభం కోసం తాపీ మేస్త్రీలకు సెంట్రింగ్ మేస్త్రీలకు ఉన్న అనుబంధాన్ని విడదీయాలని కుట్రలు చేస్తున్నారు. ఇవ్వాళ మాట్లాడే నాయకులు గత ప్రభుత్వంలో వారు భవన నిర్మాణ కార్మికులకు చేసిందేమిటో చెప్పాలి అన్నారు.సెంట్రింగ్ రేట్లు పెరుగుదల విషయమై తాపీ మేస్త్రి లను సంప్రదించి మాట్లాడుకోవాలి కానీ ఇలా బయటికి వచ్చి సమ్మె చేస్తే ఎవరు నష్టపోతారో తెలుసుకోవాలన్నారు. భవన నిర్మాణ రంగంలో భవనం నిర్మించడానికి అనేక రంగాల కార్మికులు పనిచేస్తారని అందులో భవనం నిర్మించే తాపీ మేస్త్రి కే ముఖ్య ప్రాధాన్యత ఉంటుంది. భవనం మొదలుపెట్టిన నాటినుండి అయిపోయే వరకు తాపీ మేస్త్రి ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారన్నారు.భవనం నిర్మించుకునే యజమాని సెంట్రింగ్, ప్లంబింగ్, ఎలక్ట్రిషన్, కార్పెంటర్, పెయింటర్, ఎవరికి ఇవ్వాలనేది తాపీ మేస్త్రీ సలహా యజమాని తీసుకుంటారన్నారు.సెంట్రింగ్ రేట్లు పెరుగుదల సబ్బబే అయినా కానీ సమస్యను సమ్మె వరకు తీసుకెళ్లడం సరికాదన్నారు.సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ సమ్మె చేస్తే వారి వద్ద రోజువారి పనిచేసే సెంట్రింగ్ మేస్త్రీలు,కార్మికులు నష్టపోతారన్నారు. తాపీ మేస్త్రీలు, సెంట్రింగ్ మేస్త్రీలు, కూర్చుని రేట్ల పెరుగుదల గురించి పరిష్కరించుకోవాలన్నారు.