తిమ్మాజిపేట్ నూతన ఎస్ఐ శ్రీనివాస్‌రావుకు బీఎస్‌పీ నాయకుల ఘన సన్మానం

పయనించే సూర్యుడు మే 21 నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ తిమ్మాజిపేట్, మే 20: తిమ్మాజిపేట్ మండలానికి కొత్తగా నియమితులైన సబ్‌ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్‌రావు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీఎస్‌పీ నాయకులు మాట్లాడుతూ, ప్రజలకు అందుబాటులో ఉండి సమర్థవంతమైన పోలీస్ సేవలు అందించాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతల్లో ఎస్ఐ శ్రీనివాస్‌రావు విజయవంతంగా పనిచేయాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ బీఎస్‌పీ అసెంబ్లీ అధ్యక్షులు ఎర్రోళ్ల పరశురామ్, తిమ్మాజిపేట్ బీఎస్‌పీ మండల అధ్యక్షులు ఆగపు శంకర్, కోడుపర్తి రాగి రమేష్, గుమ్మకొండ రవీందర్, బంగారి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.