తిమ్మారెడ్డికుంట తండాలో నిరుపేద యువతి వివాహానికి రూ. 5 వేల ఆర్థిక సాయం

అనాథ ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్న సభావట్ రాజేష్ నాయక్

పయనించే సూర్యుడు జూలై 05 మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామపంచాయతీ తిమ్మారెడ్డికుంట తండాకు చెందిన సభావాట్ తార్య కుమార్తె సంధ్య (అఖిల) వివాహానికి శనివారం ప్రముఖ సామాజిక కార్యకర్త సభావాట్ దేవులా నాయక్ ర కుమారుడు సభావాట్ రాజేష్ నాయక్ గారు ఆర్థిక సాయం అందించి తన ఉదారతను చాటుకున్నారు.తల్లిదండ్రులు లేని నిరుపేద ఆడబిడ్డ సంధ్య వివాహం నిశ్చయమైన విషయం తెలుసుకున్న రాజేష్ నాయక్ గారు తండాకు చేరుకుని, పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులకు రూ. 5,000/- (ఐదు వేల రూపాయలు) నగదును ఆర్థిక సాయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ఆదుకోవడం అందరి బాధ్యత అని, నిరుపేద కుటుంబాలకు తమ వంతు సాయం అందించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్థిక సాయం అందించిన రాజేష్ నాయక్ గారికి తండా ప్రజలు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్. రమేష్ నాయక్, డి. రమేష్ నాయక్, ఎస్. రాజు నాయక్ , తండా ప్రముఖులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.