తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నిత్య అన్నదాన పథకమునకు 27,000 రూపాయలు గో సంరక్షణకు 27,000 రూపాయలు విరాళముగా

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే24 పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజున శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పడమట వాస్తవ్యులు నాదెళ్ల వెంకటేశ్వరరావు రాధిక దంపతులు ఆలయ కార్య నిర్వహణ అధికారి బి మహేశ్వర్ రెడ్డి సూచనల మేరకు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం నిత్య అన్నదాన పథకమునకు 27,000 రూపాయలు గో సంరక్షణకు 27,000 రూపాయలు విరాళముగా ఆలయ సూపరిండెంట్ డివిఎన్ రాజు కు అందజేశారు వారికి ఆలయ ఇన్స్పెక్టర్ బద్ధుల కృష్ణమోహన్ అర్చకులు వేద పండితులచే వేద ఆశీర్వచనం చేసి అమ్మవారి శేష వస్త్రములు తీర్థ ప్రసాదములు అందజేశారు డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వాహణాధికారి బి మహేశ్వర్ రెడ్డి తెలియజేసినారు