తిరుపతిలో నిర్వహించిన “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం”

కూటమి పాలన విజయోత్సవ సభ పాల్గొన్న కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ

పయనించే సూర్యుడు జూన్ 13 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఈ మహాసభకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ హాజరై కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయాలను ప్రజలతో కలిసి వేడుకగా జరుపుకున్నారు. గత రెండేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ప్రజలకు సుపరిపాలన అందించిందన్నారు. రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు మరియు అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అనేక ప్రజాహిత కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసిందని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని, పారిశ్రామిక పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన, ఉపాధి అవకాశాల సృష్టి, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విశేష ఫలితాలను సాధించిందని ఆమె తెలిపారు.రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మరింత సమర్థవంతమైన పాలన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆది కృష్ణమ్మ పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త ప్రజలకు మరింత చేరువై ప్రభుత్వ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.ఈ విజయోత్సవ సభలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొని కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయాలను ఘనంగా జరుపుకున్నారు.