తిరుపతి మహాసభకు తరలిన తెలుగు తమ్ముళ్లు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జూన్ 13.06.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ// తిరుపతి పట్టణంలో జరిగిన రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం మహాసభకు చౌడేపల్లి నుంచి పలువురు తెలుగు తమ్ముళ్లు తరలి వెళ్లారు నియోజకవర్గ నాయకుడు మాదిరాజు లక్ష్మణ రాజు ( పతి రాజు) మాదిరాజు ప్రదీప్ రాజు ల ఆధ్వర్యంలో చౌడేపల్లి మండలంలోని తెలుగు తమ్ముళ్లు సభకు వెళ్లారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంతకుముందు అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు ఏ విధంగా అందాయన్న అంశాలపై నినదిస్తూ వాహనాల ద్వారా తిరుపతికి బయలుదేరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఆవుల రామచంద్రయ్య వేలూరు సుబ్రహ్మణ్యం కార్తీక్ పవన్ కుమార్ బోయకొండ శివప్ప రామకృష్ణ తదితరులు తిరుపతికి తరలి వెళ్లిన వారిలో ఉన్నారు