తిరుమలగిరి గ్రామములో వేంచేసియున్న స్వయంభు శ్రీ వల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము నందు జరుగుచున్న నిత్యాన్నదాన పధకమునకు రూ.1,11,116/- విరాళం

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జూన్ 14 జగ్గయ్యపేట మండలము తిరుమలగిరి గ్రామములో వేంచేసియున్న స్వయంభు శ్రీ వల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము నందు జరుగుచున్న నిత్యాన్నదాన పధకమునకు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వాస్తవ్యులు చిన్నం అనంత కిరణ్ కుమార్ ఉమాశ్రీ దంపతుల కుమార్తె, చిన్నం లక్ష్మీ వెంకట నాగ దిశణ దేవి, కుమారుడు చిన్నం వేంకట నాగ జ్యోతిరాదిత్య దత్త రూ.1,11,116/- రూపాయలు విరాళముగా అందజేసియున్నారు. వారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా సిబ్బంది శ్రీ స్వామి వారి చిత్రపటం, ప్రసాదములు అందజేయుట జరిగినది అని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గుమ్మా వెంకటేష్, సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి సి.హెచ్. రంగారావు వారు తెలియజేసియున్నారు.