తెదేపా సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్న కార్యకర్తకు అరుదైన గుర్తింపు

★ తెదేపా కార్యకర్తను బహుమతితో ఉత్సాహపరిచిన యువనేత లోకేష్ ★ టీడీపీ కార్యకర్త నగరి అక్బర్ వలికి సైకిల్ గుర్తు బహుమానం అందజేస్తున్న ఎమ్మెల్యే బీవీ

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 09, 2026: గోనెగండ్ల రిపోర్టర్ సురేష్ మై టీడీపీ యాప్ లో ఉత్సాహపరిచిన టిడిపి కార్యకర్త నగిరి అక్బర్ వలికి తెదేపా యువనేత విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ నుండి బహుమానం పంపించారు. సందర్భంగా సోమవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి చేతుల మీదుగా సైకిల్ గుర్తు, ఉత్తమ కార్యకర్త సర్టిఫికేట్ గోనెగండ్లకు చెందిన నగిరి అక్బర్ వలీ కి అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ ము ప్రవేశపెడుతున్న ప్రభుత్వ సంక్షేమ ప్రచార ప్రసారలను ఎప్పటికప్పుడు మై టిడిపి యాప్ లో తెదేపా కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేస్తూ తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ బాబు లా ఆదేశాలను తూచా తప్పకుండా యాప్ లో మంచి స్కోరింగ్ ప్రతిభను కనబరిచిన వారికి అధినేతల నుండి వచ్చే చిరు బహుమానాలే అయినా మా మనసుకు పార్టీలో అత్యున్నత పదవులతో సమానంగా భావిస్తున్నామని కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తపరిచారు. అలాగే టిడిపి నాయకులు కార్యకర్తలు తప్పని సరిగా మై టీడీపీ యాప్ వాడాలి మన చేసే కార్యక్రామాలు ఆఫ్ లోడ్ చేయాలని సూచించారు.నగిరి అక్బర్ వలి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షుడు నాగరాజు, పులకుర్తి ఉరకుందు , తదితరులు పాల్గొన్నారు.