పయనించే సూర్యుడు, జూన్ 06 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి కుమార్ “తెలంగాణను కేవలం అభివృద్ధి చెందిన రాష్ట్రంగా కాకుండా,ప్ర పంచం వైపు చూసే రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే దూరదృష్టితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతు న్నారని అన్నారు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియో జకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఫ్యూచర్ సిటీ,రేడియల్ రోడ్లు,రహదారి విస్తరణ పనుల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి జూన్ 8వ తేదీన శేరిలింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధికి శ్రీకా రం చుట్టేవిదంగా మియాపూర్ మెట్రో నందు నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ వేదిక ఏర్పాట్లను డిసిసి అధ్యక్షులు చైర్మన్ శ్రీ చెల్లా నర్సింహ రెడ్డి ,మేడ్చల్ డిసిసి అధ్యక్షులు శ్రీ వజ్రేష్ యాదవ్ శేరిలింగంపల్లి నియో జకవర్గం శాసనసభ్యులు అరెక పూడి గాంధీ కూకట్పల్లి నియోజ కవర్గం ఇంచార్జ్ బండి రమేష్ ,కు త్బు లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హనుమంత్ రెడ్డి,శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులతో కలిసి పరిశీలించారు.టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరి లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రె స్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్..
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృ క్పథం అభివృద్ధి ఫలాలు తెలం గాణలోని ప్రతి గ్రామానికి,ప్రతి కుటుంబానికి చేరేలా చేయడమే వారి లక్ష్యం” అనే భావనతో ము ఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, మౌలికసదపాయాలు, పెట్టుబడులు, విద్య, వైద్యం, పారిశ్రామికీకరణ, సాగునీరు సంక్షేమ రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు.. ఈ సందర్భంగా శేరిలింగంపల్లి అభివృద్ధి పనులకోసం విచ్చేస్తు న్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి ,మంత్రుల సభ ను విజయవంతం చేయాలని శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజానీకానికి పిలుపునిచ్చారు..