పయనించే సూర్యుడు, కోరుట్ల జూన్ 9. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం అయిలాపూర్ గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి రాహుల్ హైదరాబాద్లో అదృశ్యమయ్యాడు. అనంతరం ఒంగోలు జిల్లా సింగరాయకొండ సమీపంలోని ఓ బావిలో అతని మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక సమాచారం ప్రకారం రాహుల్ ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అయిలాపూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకొన్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.