తెలంగాణా అభివృద్ధికి భారీ కనుక 1090 కోలోమీటర్ల జాతీయ రహదారులు సహకరించిన నరేంద్ర మోడీ నితిన్ గాడ్కరి ధర్మపురి అర్వింద్ కి పాలాభిషేకం

పయనించే సూర్యుడు, కోరుట్ల జూన్ 5. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనూప్ రావు ఆదేశాలమేరకు కోరుట్ల బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ, నితిన్ గాడ్కరి ధర్మపురి అర్వింద్ చిత్ర పటాలకు పాలాభిషేకం భారతీయ జనతా పార్టీ కోరుట్ల పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ, నితిన్ గాడ్కరి, ధర్మపురి అర్వింద్ చిత్రపటాలకు పాలాభిషేకం ఎన్ హెచ్63 అర్ముర్ జగిత్యాల కరీంనగర్ నాలుగు లైన్ల ఎన్ హెచ్ 563 జగిత్యాల కరీంనగర్ నాలుగు లైన్ల విస్తీర్ణకు గ్రీన్ సిగ్నల్ 1090 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధికి సహకరించిన. నరేంద్ర మోడీ ఉత్తర తెలంగాణకు జాతీయ రహదారులు నాలుగు లైన్ల విస్తరణకు 7597 కోట్లు మంజూరు చేసిన సందర్భంగా వారికి కోరుట్ల పట్టణ శాఖ వారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కస్తూరి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నిజామాబాదు నుండి జగిత్యాల వరకు మన పార్లమెంటు 4 లైన్ల రోడ్డు విస్తరణకు సహకరించిన అలాగే మరెన్నో అభివృద్ధి పనులకు సహకరిస్తున్న ధర్మపురి అరవింద్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. అభివృద్ధి అంటే మోదీ మోడీ అంటే ధర్మపురి అరవింద్ అని కొనియాడరు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శిలు చెట్లపల్లి సాగర్,ఎర్ర రాజేందర్, మ్యాకల గణేష్ జిల్లా నాయకులు సుదవిన్ మహేష్, గిన్నెల శ్రీకాంత్, తులసి కృష్ణ, మైదం సత్యనారాయణ, ఉప్పులోటి రాఘవులు, చెట్పెల్లి ఓం ప్రకాష్,తాళ్లపల్లి శ్రీనివాస్, దమ్మ సంతోష్, ఎల్లల నారాయణరెడ్డి, మామిడి మల్లేష్ రెడ్డి,వల్లజి నగేష్, చిట్యాల రాజేందర్, దామ శ్రవణ్,నారవేణి విజయ్, గుంటుక నాగరాజ్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.