తెలంగాణ ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాలను పెంచడం హర్సణీయం

★ 73 షెడ్యూల్ కింద కనీస వేతనాల పెంపు: గత 10 సంవత్సరాల అనంతరం ప్రధాన సవరణ ★ జూన్ 2 నుంచి అమలవుతున్న జోన్-వైజ్ పెంపు, ★ 1.11 లక్షల కార్మికుల కుటుంబాలు లబ్ధి. ★ ప్రభుత్వానికి ,వేతన మండలి ఛైర్మన్‌లకు ఐటిసి కార్మికుల ధన్యవాదాలు.

పయనించే సూర్యుడు మే 22 బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ తెలంగాణ రాష్ట్ర కనీస వేతనలు మండలి 73 షెడ్యూల్ కు సంబంధించిన కనీసం వేతనాలు పెంపు పై ఐఎన్టియుసి కాంట్రాక్ట్ వర్కర్ల అధ్యక్షులు ఉర్లుగొండ వీరన్న హర్షం వ్యక్తం చేశారు.ఈ నిర్ణయం రాష్ట్రంలోని సుమారు 1.11 లక్షల కార్మికుల కుటుంబాలు లబ్ధి పొందుతారని ఐఎన్‌టియు‌సి కాంట్రాక్ట్ వర్కర్ల అధ్యక్షుడు ఉర్లుగోండ వీరన్న అన్నారు. గత 10 ఏళ్లుగా స్థిరంగా ఉండి పెరగని కనీస వేతనాలను ప్రస్తుత ప్రభుత్వం పెంచడం ద్వారా .పెరుగుతున్న ధరలు, జీవన వ్యయాల సందర్భంగా ఈ నిర్ణయం కార్శిక కుటుంబాలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తుందది పేర్కొన్నారు.ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఆర్థిక భద్రత, జీవన ప్రమాణాల మెరుగుదల కలుగుతుందది తెలిపారుముఖ్యంగా కాంట్రాక్టు అపుట్ సోర్ఫింగ్ రంగాల్లో పనిచేస్తున్న యువ ఉద్యోగులకు కూడా ఈ నిర్ణయం ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు..రాష్ట్ర కనీస వేతన మండలి సభ్యుడైన ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి యారం పిచ్చిరెడ్డి ఈ మండలిలో సభ్యులుగా ఉండటం మాకు ఎంతో గర్వకారణం అన్నారు కార్మిక సంక్షేమం పట్ల అంకితభావంతో పనిచేస్తున్న యారం పిచ్చిరెడ్డి ఈ వేతనాలు పెంపులో కీలకపాత్ర పోషించారని అన్నారు.జోన్ వారీగా వేతనాల్ని విభజిస్తూ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు: జోన్-1 (మున్సిపల్ కార్పొరేషన్లు), జోన్-2 (మున్సిపాలిటీల ప్రాంతాలు), జోన్-3 (గ్రామీణ ప్రాంతాలు). వేతన శ్రేణులను అన్‌స్కిల్డ్, సెమీ-స్కిల్డ్, స్కిల్డ్, హై-స్కిల్డ్‌గా నాలుగు కేటగిరీలుగా విభజించారు.జూన్ 2 నుంచి అమలులోకి వచ్చే వేతనాల పరిమాణాలు ఇలా ఉన్నాయి: జోన్-1 అన్‌స్కిల్డ్ కార్మికుల కనీస వేతనం రూ.12,750 నుంచి రూ.16,000కి పెరిగింది; సెమీ-స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,592 నుంచి రూ.17,000కి పెరిగింది; స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,772 నుంచి రూ.18,500కి పెరిగింది; హై-స్కిల్డ్ కార్మికుల వేతనం రూ.14,607 నుంచి రూ.20,000కి పెరిగిందని సీఎం వెల్లడించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కు కి కనీస వేతనం మండలి చైర్మన్ డాక్టర్ జనక ప్రసాద్ కి మరియు సంబంధిత మంత్రివర్గ సభ్యులకు ఐటీసీపీఎస్పీడీ కార్శికుల తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.