తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ - గోలి శ్రీనివాస్ రెడ్డి

పయనించే సూర్యుడు, జూన్ 3 2026, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం కల్వకుర్తి, వెల్దండ మండలాలలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం తో కలిసి తెలంగాణ రాష్ట్ర సాధనకోసం అమరులైన అమరవీరులకు నివాళులు అర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలతో వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకుంటారని పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో రాష్ట్రస్థాయి నాయకులు, అధికారులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు కలిసి తెలంగాణ సాధనకు అంకితభావాన్ని వ్యక్తం చేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ కృషి, స్ఫూర్తి తెలంగాణ ఉద్యమాన్ని విజయవంతం చేయడంలో ఆయన చూపిన నాయకత్వం చిరస్మరణీయమని గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రైతులు, యువత, మహిళల అభ్యున్నతి కోసం కేసీఆర్ అమలు చేసిన పథకాలు తెలంగాణ అభివృద్ధికి బాటలు వేసాయని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలు మరియు ఆశయాలు ప్రతి తెలంగాణ పౌరుడికి స్ఫూర్తిగా నిలుస్తాయని తెలిపారు. అమరవీరుల కలలను సాకారం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ప్రజల్లో ఐక్యత, సామరస్యం, అభివృద్ధి భావాలను పెంపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా స్వీయ గౌరవానికి, ఆత్మగౌరవానికి ప్రతీక అని వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనలో సాంస్కృతిక కార్యక్రమాలు, దేశభక్తి గీతాలు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ అమరవీరుల త్యాగాలకు వందనం తెలంగాణ అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ మరొకసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి, వెల్దండ మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో తదితరులు పాల్గొన్నారు.