తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ – సన్రైజ్ టు సన్సెట్ నిరవధిక శాస్త్రీయ నృత్య మహోత్సవం

పయనించే సూర్యుడు తేదీ: 13-08-2026 (మల్కాజిగిరి ఇంచార్జ్ డా. రఘుపతి ప్రతినిధి): తెలుగు సంస్కృతి, సంప్రదాయ కళల పరిరక్షణ మరియు శాస్త్రీయ నృత్య కళాకారులకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఆధ్వర్యంలో, ఓం శివ ఆర్ట్స్ అకాడమీ నిర్వహణలో “సన్రైజ్ టు సన్సెట్ నిరవధిక శాస్త్రీయ నృత్య మహోత్సవం” నిర్వహించనున్నట్లు డాక్టర్ రఘుపతి తెలిపాడు . ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం 2026 ఆగస్టు 30వ తేదీన శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కళా ప్రాంగణం, హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించబడనుంది. ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమయం వరకు నిరవధికంగా కొనసాగే ఈ శాస్త్రీయ నృత్య మహోత్సవంలో కూచిపూడి, భరతనాట్యం, ఆంధ్రనాట్యం తదితర భారతీయ శాస్త్రీయ నృత్య కళారూపాలకు చెందిన కళాకారులు పాల్గొనే అవకాశం కల్పించబడుతోంది. నాట్య కళపై ఆసక్తి కలిగిన విద్యార్థులు, నృత్య గురువులు, కళాకారులు మరియు నృత్య సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనే కళాకారులకు ప్రత్యేక గుర్తింపు పత్రాలు, సత్కారాలు మరియు తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదు అయ్యే అవకాశాలు కల్పించబడతాయని పేర్కొన్నాడు . రాష్ట్రవ్యాప్తంగా మరియు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నాట్య కళాకారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డాక్టర్ రఘుపతి పిలుపునిచ్చారు.

వివరాల కోసం సంప్రదించండి:

81069 12603

93914 83218