తెల్కపల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు.

మహిళా సమాఖ్య కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

పయనించే సూర్యుడు జూన్ 2. నాగర్ కర్నూల్ జిల్లా తెల్కపల్లి మండల రిపోర్టర్ సుల్తాన్ తెల్కపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి నూతన గృహాల్లోకి ప్రవేశించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం తెల్కపల్లి మండల మహిళా సమాఖ్య కేంద్రాన్ని ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు మహిళా సంఘాలు కీలక భూమిక పోషిస్తున్నాయని, స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావు, సర్పంచ్ కొమ్ము చంద్ర శేఖర్ , ఉప సర్పంచ్ శ్రీనివాసులు , మండల్ అధ్యక్షుడు బండ పర్వతాలు ,మాజీ సింగల్ విండో వైస్ చైర్మన్ యాదయ్య ,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు