పయనించే సూర్యుడు జులై 6 తొర్రూరు మండలం మహబూబాబాద్ జిల్లా రిపోర్టర్ శ్రీధర్. తొర్రూర్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు ఎర్ర సోముల తండ లో శనివారం మున్సిపల్ చైర్మన్ విస్తృతంగా పర్యటించి పలు సమస్యలను పరిశీలించారు ఈ సందర్భంగా తండలో మంచినీటి పైపులు లీకై వీటి సమస్య ఏర్పడిన విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకొని పాత పైపులను తొలగించి కొత్త పైపులను వేయిస్తామని హామీ ఇచ్చారు. అలాగే డ్రైనేజ్ సమస్యలు రోడ్ల సమస్యలను పరిశీలించి వాటిని కూడా పూర్తి చేసి తండ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ యువజన నాయకులు రాజేష్ యాదవ్ మున్సిపల్ ఏఈ, మున్సిపల్ సిబ్బంది స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
.
