పయనించే సూర్యడు జూన్ 14 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు నడిగూడెం ఆన్‌లైన్ వేదికగా జరిగిన 'కిడ్స్ ఫోటో కాంటెస్ట్' (ట్రాయో కిడ్స్ కాంటెస్ట్) సీజన్-31 పోటీల్లో నడిగూడెం గ్రామానికి చెందిన మూడు నెలల చిన్నారి గెల్లా తుర్వికృతిక అద్భుత ప్రతిభ కనబరిచింది. తొలి ప్రయత్నంలోనే రెండు విభాగాల్లో విజేతగా నిలిచి పతకాలు, ప్రశంసాపత్రాలను కైవసం చేసుకుంది. రెండు విభాగాల్లో విజయం: సంస్థ నిర్వహించిన ఆన్‌లైన్ పోటీల్లో తుర్వికృతిక 'బెస్ట్ క్లిక్' మరియు 'లిటిల్ మెర్మైడ్' అనే రెండు ఫోటో కేటగిరీలలో పాల్గొంది. తనదైన మురిపాలతో ఆకట్టుకున్న చిన్నారి, ఈ రెండు విభాగాల్లోనూ విజేతగా నిలిచి మెడల్స్ మరియు ధ్రువపత్రాలను సాధించింది. కుటుంబ సభ్యుల హర్షం: ఈ చిన్నారి నడిగూడెం గ్రామానికి చెందిన బుస్సా మహేష్, సులోచనల మనవరాలు మరియు గెల్లా సంగమేశ్, దివ్య శ్రీల ముద్దుల కుమార్తె. తన చిన్న వయసులోనే ఈ ఘనత సాధించడం పట్ల చిన్నారి నానమ్మ, తాతయ్యలు గెల్లా లక్ష్మీ, శ్రీధర్ కుమార్, బంధువులు, కుటుంబ సభ్యులు శ్రీధర్ కుమార్, సాయి సంతోష్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు. చిన్నారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు.