
పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం నవంబర్ 2 పెనుగంచిప్రోలు మండల పరిధిలో జరిగే ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో తోటచర్ల తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి నారాయణరావు ఎన్నికల ప్రచారం రోజురోజుకూ హోరెత్తుతోంది. తెలుగుదేశం పార్టీ అధిష్టానం వేముల నారాయణరావుని ఎంపీటీసీ అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఆయనతోపాటు తన కుమారుడు వేముల సాయి ప్రచారం కొనసాగిస్తున్నారు . మా నాన్నగారైన నారాయణ రావు కి రాజకీయంలో అనుభవం లేకపోయినా వేముల వారి రాజకీయం అనుభవం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు వారి కుటుంబ సభ్యుల్లో నారాయణ రావు కూడా ఒకరు, తోటచర్ల రాజకీయం పరిపాలన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు మా కుటుంబ సభ్యులైన వేముల నరసింహారావు , వేముల సైదేశ్వర , ఏ విధంగా గ్రామ సమస్యలను పరిష్కరించారు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా నారాయణ రావు కూడా చేస్తారు అని గ్రామంలో ఏ సమస్య ఉన్న మీ మీ సమస్యని నా సమస్యగా భావించి ఆ యొక్క సమస్యనే పరిష్కరిస్తానని మీ కుటుంబ సభ్యులలో ఉన్న వ్యక్తిగా మీ ముందుకు వచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నాను. అని నా తండ్రిగారైన వేముల నారాయణరావు తరపున నేను మీకు వాగ్దానం చేస్తున్నాను . నారాయణ రావు గెలిచిన వెంటనే అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపుతాను" అని ఆయన ప్రజలకు హామీ ఇస్తున్నారు. "మీ అమూల్యమైన రెండు ఓట్లలో ఒకటి జడ్పిటిసి అభ్యర్థి జిల్లేపల్లి సుధీర్ బాబుకు మరొకటి ఎంపీటీసీ అభ్యర్థి మా నాన్నగారైన వేముల నారాయణరావు కి వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాను" అని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేముల వెంకటేశ్వరరావు, పార్టీ కన్వీనర్ కుంటముక్కల ప్రకాష్ , పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.