దామాల దయాకర్ కుభారత కమ్యూనిస్టు పార్టీకి సంబంధం లేదు.సిపిఐ నేత శింగు నరసింహారావు

పయనించే సూర్యుడు: మే: 21/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్: గద్దె. విజయ బాబు భారత కమ్యూనిస్టు పార్టీ కల్లూరు మండలం కార్యదర్శిగా ఉన్న దామాల దయాకర్ ను పార్టీ ప్రజాసంఘాల బాధ్యతల నుండి తొలగించుతూ జిల్లా పార్టీ నిర్ణయం తీసుకుందని జిల్లా కార్యవర్గ సభ్యులు శింగు నరసింహా రావు తెలిపారు. ఈరోజు కల్లూరులో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు వేము రాంబాబు, సిపిఐ మండల కమిటీ సభ్యులు కొత్తపల్లి వెంకటనారాయణ కలిసి నిర్వహించిన ప్రెస్మీట్లో వారు మాట్లాడుతూ పార్టీ పద్ధతులకు విరుద్ధంగా నిర్మాణరాహిత్యంగా ప్రవర్తించుతున్న కల్లూరు మండలం కార్యదర్శిగా ఉన్న దామాల దయాకర్ ను పార్టీ ప్రజా సంఘాల బాధ్యతల నుండి తొలగించుతూ పార్టీ జిల్లా కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నదని భారత కమ్యూనిస్టు పార్టీకి దయాకర్ తో సంబంధం లేదని తెలిపారు. కార్మికులు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై భారత కమ్యూనిస్టు పార్టీ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాలలో పేర్కొన్న విధంగా మహిళలకు నెలకు రు 2500/-కళ్యాణ లక్ష్మి తులం బంగారం, ఆటో కార్మికులకు రు12000/-, పెన్షన్లు నెలకు రు4000/- మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు రు10,000/- గ్రామపంచాయతీ, మున్సిపల్ వివోఏ లకు నెలకు కనీస వేతనం రు26,000/- అమలు చేయాలని సమస్యలు పరిష్కారం కొరకు సిపిఐ పోరాడుతుందని ఆయా రంగాల ప్రజలు పోరాటాలో కలిసి రావాలని పిలుపునిచ్చారు.