దుబ్బాక కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి.. ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని కలిసిన మండల అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి

పయనించే సూర్యుడు జులై 4 రాజేష్) దౌల్తాబాద్, జూలై 3: దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డిని దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో పార్టీ సంస్థాగత బలోపేతం, సభ్యత్వ నమోదు కార్యక్రమం, గ్రామస్థాయిలో పార్టీ కార్యకలాపాల విస్తరణ, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసి, కాంగ్రెస్ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన జనగామ మల్లారెడ్డికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతంలో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తిరుమలాపూర్ సర్పంచ్ బండరు లాలు, సీనియర్ నాయకుడు కర్నాల శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సంపత్ రెడ్డి, దౌల్తాబాద్ మాజీ సర్పంచులు ఆది వేణుగోపాల్, భద్రయ్య, నాయకులు ఆంజనేయులు గౌడ్, మల్లికార్జున్, ఇమ్రాన్.శ్రీనివాస్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.