పయనించే సూర్యుడు జూన్ 9 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆదోని మండలం దిబ్బనకల్ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త హరిజన బుజ్జల గోవిందు కరెంట్ షాక్కు గురై దురదృష్టవశాత్తు మృతి చెందడం బాధాకరం.ఈ విషయం తెలుసుకున్న వెంటనే టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు హాస్పిటల్కు వెళ్లి గోవిందు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే వైద్యులు మరియు పోలీసు అధికారులతో మాట్లాడి ఘటనకు సంబంధించిన ప్రక్రియలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను కోరారు.గోవిందు ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యం కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నా.