( పయనించే సూర్యుడు మే 24 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో జనగణన కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులచే ప్రత్యేక ప్రచార కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి శ్రీ బి. జ్జూరి రవికుమార్, డీపీఆర్‌ఓ మరియు ఏడి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీఎస్‌ఎస్ దుబ్బాక టీం మరియు సిద్దిపేట టీం కళాకారులు గ్రామాల్లో మాట, పాటల ద్వారా జనగణన ప్రాముఖ్యతను ప్రజలకు వివరించారు. ప్రతి కుటుంబం సరైన సమాచారం అందించడం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు కావచ్చని కళాకారులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల ఎమ్మార్వో చంద్రశేఖర్ రావు, సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్, గ్రామ సర్పంచ్ అనురాధ రమేష్, వార్డ్ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. దుబ్బాక టీం తరఫున బిట్ల ఎల్లయ్య (టీం లీడర్), ఆస రామారావు, కమ్మరి నర్సయ్య, పిల్లుట్ల ప్రకాష్, తుమ్మల ఎల్లయ్య, సూరంపల్లి శేఖర్, జినుక దేవదాస్ పాల్గొన్నారు. సిద్దిపేట టీం తరఫున వెంకటాపురం రవి (టీం లీడర్), కొమ్ము రవీందర్, నీరటి రవీందర్, కొమ్ము ఎల్లం, ఎరుపుల తిరుమలయ్య, మొక్కపల్లి బాబాయి, భార్గవి తదితర కళాకారులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కళాకారుల ప్రదర్శనలను ఆసక్తిగా వీక్షించి జనగణన కార్యక్రమానికి సహకారం అందించాలని ప్రతిజ్ఞ చేశారు.