దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా జనగామ మల్లారెడ్డి ఎన్నిక

పయనించే సూర్యుడు జులై 3 రాజేష్ ) దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా జనగామ మల్లారెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా అభినందనలు తెలియజేశారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మల్లారెడ్డిని మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నారెడ్డి సంపత్ రెడ్డి, సుంకే రమేష్, సి.హెచ్. మహేష్ తదితరులు శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మల్లారెడ్డి నాయకత్వంలో దౌల్తాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు. ఆయన సమర్థ నాయకత్వంలో పార్టీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ అన్నారెడ్డి సంపత్ రెడ్డి, సుంకే రమేష్, సి.హెచ్. మహేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొని నూతన అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలియజేశారు.