ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి …

- పోచన్నపేటలో అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్ ...

పయనించే సూర్యుడు, జూన్ 6, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. బచ్చన్నపేట మండలం లోని పోచన్నపేట ఐకెపి కొనుగోలు కేంద్రం , ధాన్యం నిలువల గోదామును జిల్లా అడిషనల్ కలెక్టర్ బెన్ షాలోమ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రైతుల నుంచి సేకరిస్తున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని, రవాణాలో ఎలాంటి ఆలస్యం జరగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రము లో రైతుల ధాన్యం ను కాంటాలు పూర్తి చేయాలని, వెంట వెంటనే ఇదే గ్రామంలోని గోదాంలో దిగుమతి చేసి కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని, ఐకెపి సిసి కి కొనుగోలు మహిళా కమిటీకి సూచించారు. ఈ సందర్భంగా కేంద్రాల్లో జరుగుతున్న కొనుగోలు ప్రక్రియ, ధాన్యం నిల్వలు, గన్నీ బ్యాగుల లభ్యత మరియు లారీల రవాణా వ్యవస్థను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఇప్పటివరకు ఎన్ని లారీల ధాన్యం తరలించారు..? ఏయే మిల్లులకు పంపించారనే వివరాలను కేంద్ర నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.​ కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం కాంటా పనులను, ట్రాక్టర్ల ద్వారా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. వర్షాల ముప్పును దృష్టిలో ఉంచుకుని, రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో కొనుగోళ్ల ప్రక్రియ మొత్తాన్ని ముగించాలని స్పష్టం చేశారు.ఈ తనిఖీలో స్థానిక తహసిల్దార్ హుస్సేన్ , రెవిన్యూ ఇన్స్పెక్టర్ వంశీకృష్ణ , ఐకేపీ సీసీ యాదగిరి, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.