నకిలీ విత్తనాలంటూ రైతులు ఆందోళన.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.

పయనించే సూర్యుడు జులై 7 తొర్రూర్ మండలం మహబూబాబాద్ జిల్లా రిపోర్టర్ శ్రీధర్. తొర్రూర్ పట్టణ కేంద్రంలోని ఓ ఫెర్టిలైజర్ షాప్ లో కొనుగోలు చేసిన వరి విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మండల పరిధిలోని చెర్లపాలెం గ్రామ రైతులు దర్శనాల మహేందర్ కుర్ర సుధాకర్ సింగారపు మధు తదితరులు తమ పొలంలో వరుణ్ కంపెనీకి చెందిన 1638 రకం విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేశారు. విత్తనాలు నాటి వారం రోజులు గడిచిన మొలకలు రాకపోవడంతో తీవ్ర నష్టం ఎదుర్కొంటున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు సంబంధిత వ్యవసాయ అధికారులు ఈ సంఘటనపై విచారణ జరిపి విత్తనాల నాణ్యత పరీక్షించాలని తప్పిదం నిర్ధారణ జరిగితే షాపు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు