నడిగూడెంలో ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

పయనించే సూర్యడు జూలై 07 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు ​ నడిగూడెం మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( ఎమ్మార్పీఎస్ ) 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు గౌరవ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు మొలుగూరి సైదులు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు. ​ఈ సందర్భంగా ఎంఈఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు, ఎంఆర్పీఎస్ మండల ఇంచార్జ్ పాతకోట్ల నాగరాజు, ఏపూరి పర్వతాలు, పాతకోట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. గత 32 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. వర్గీకరణ ద్వారా దక్కిన ఫలాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ​వికలాంగుల ఆత్మగౌరవం కోసం, గుండెజబ్బుల బాధితులకు ఆరోగ్యశ్రీ ప్రదాతగా నిలిచిన మందకృష్ణ మాదిగకు వారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ​ఈ కార్యక్రమంలో ఎంఎస్‌ఎఫ్ సూర్యాపేట జిల్లా కన్వీనర్ పండిట్ నవీన్ కుమార్, ఎంఆర్పీఎస్ నడిగూడెం గ్రామ అధ్యక్షులు దున్న వంశీ, వేణుగోపాలపురం అధ్యక్షులు లక్ష్మీనారాయణ, గంటేపంగు నమ్రుత్, నాగవరపు దయాకర్, గోపి, చరణ్, సిద్దు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.