పయనించే సూర్యుడు జూన్ 13 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ శ్రావణ్ కుమార్ వనపర్తి జిల్లా కేంద్రంలోని యాదవ భవన్లో బీఎస్పీ నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షుడు మిద్దె మహేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, 4వ జోన్ ఇంచార్జ్ శ్రీరామ్ కృష్ణ మాట్లాడుతూ గ్రామ, బూత్, సెక్టార్, మండల, అసెంబ్లీ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని గ్రామగ్రామాన బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఓటరు జాబితాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీఎస్పీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పార్లమెంట్ ఇంచార్జ్లు బీసమోళ్ళ యోసేపు, పృథ్వీరాజ్, పార్లమెంట్ ఇంచార్జ్లు గూడెం ఎల్లస్వామి, సి. కళ్యాణ్, మాసన్న, జిల్లా అధ్యక్షులు బోనాసి రాంచందర్, మణికుమార్తో పాటు పలువురు నాయకులు, ఏడు అసెంబ్లీల అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.