నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ అడ్మిషన్లకు శ్రీకారం

పయనించే సూర్యుడు జూన్ 07, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలోని నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్త అడ్మిషన్ల కరపత్రాలను నాగులవంచ గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాంబాయి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన సౌకర్యాలను కల్పిస్తూ ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేస్తోందని అన్నారు. తెలుగు, ఇంగ్లీష్ మీడియంలలో ఒత్తిడి లేని నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు.కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎల్‌ఎం&డీటీ, ఏసీపీ&ఎం తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ పి. నవీన్ బాబును అభినందించారు.ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు నాగులవంచ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరి ఉన్నత విద్యను అభ్యసించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని, గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పి. నవీన్ బాబు, అధ్యాపకులు కృష్ణార్జునరావు, ఆరోగ్య వరప్రసాద్, అల్లు విజయ్, వెంకటరెడ్డి, శ్రీనివాసరావు, రాంబాబు, అయూబ్, నాగేశ్వరరావు, గ్రామస్తులు, యువతీ యువకులు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.