పయనించే సూర్యుడు జులై 4 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. ఆదొని శాసనసభ్యులు డా. పీవీ పార్థసారథి శుక్రవారం సాయంత్రం ఆదోని మండలం-1 పరిధిలోని నాగులాపురం గ్రామంలో నిర్వహించిన “ప్రజల కోసం… మీ పార్థసారథి” కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని వారి సమస్యలు, అవసరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అమలు చేస్తున్న పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. ముఖ్యంగా ప్రతి నెల అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో సామాజిక భద్రతా పెన్షన్లు అందుతున్నాయని, రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ఆర్థిక సహాయం క్రమం తప్పకుండా జమ అవుతోందని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వల్ల కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గిందని మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమం, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వానికి, అలాగే ప్రజల వద్దకే వచ్చి సమస్యలు తెలుసుకుంటూ నిరంతరం అందుబాటులో ఉంటున్న ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి కి గ్రామస్తులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం గ్రామంలో తాగునీరు, అంతర్గత రహదారులు, పారిశుధ్యం, విద్యుత్, గృహ నిర్మాణ బిల్లులు, పెన్షన్లు తదితర సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి సమస్యను సంబంధిత అధికారుల ద్వారా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.ప్రజల సమస్యలను తెలుసుకోవడం మాత్రమే కాకుండా వాటికి శాశ్వత పరిష్కారం చూపించడమే “ప్రజల కోసం… మీ పార్థసారథి” కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే డా. పీవీ పార్థసారథి తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా ప్రతి గ్రామ అభివృద్ధికి, ప్రతి కుటుంబ సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్లేష్,లింగన్న ,రామలింగ , నర్సప్ప, నరసింహులు, బీజేపీ నాయకులు రాఘవేంద్ర, నాగరాజు, వీరేష్, ఉరుకుందు,గ్రామ పెద్దలు, మహిళలు మరియు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.