నాడు తక్షణ సాయంగా రూ. 1 లక్ష రూపాయలు అందించి నేడు కూటమి ప్రభుత్వం ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 3 లక్షలుచెక్కులు అందించిన ఎమ్మెల్యే పంతం నానాజీ..

పయనించే సూర్యుడు జూన్ 7, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళుతుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు శ్రామికుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. నాడు ప్రమాదం జరిగిన వెంటనే శాసనసభ్యులు పంతం నానాజీ గారు స్వయంగా బాధితులను పరామర్శించి, తక్షణ సాయం నిమిత్తం తన సొంతంగా ప్రతి కుటుంబానికి రూ. 1 లక్ష చొప్పున తక్షణ ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకున్నారు. మృతుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన ఒక్కొక్క కుటుంబానికి రూ. 3,00,000/- చొప్పున ఐదుగురు సంబంధిత కుటుంబాలకు మొత్తం రూ. 15 లక్షల విలువైన ప్రభుత్వ ఎక్స్‌గ్రేషియా చెక్కులను వారి ఇంటి వద్దకే వెళ్లి ఈరోజు ఎమ్మెల్యే నానాజీ కూటమి ముఖ్య నాయకులతో కలిసి బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ.. ప్రమాదంలో పేద శ్రామికుల కుటుంబాలు కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేకపోయినా, వారి కుటుంబాలు ఇబ్బందులు పడకుండా కూటమి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తీవ్రంగా గాయపడి ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన క్షతగాత్రురాలితో పాటు, బాధిత కుటుంబాల అందరికీ ప్రభుత్వం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి , కటకంశెట్టి ప్రభాకర్ , డా. చప్పిడి వెంకటేశ్వర రావు , నూరుకుర్తి వెంకటేశ్వర రావు , ప్రకాష్ గౌడ్ , రంబాల వెంకటేశ్వర రావు, పితాని లీల , బోళ్ల కృష్ణ మోహన్ , శిరంగు శ్రీనివాస్ గారు, కరెడ్ల గోవింద్ , తాటికాయల వీరబాబు , పొనగంటి మహేష్ , పితాని అప్పన్న , వాసంశెట్టి శ్రీనివాస్ , అడప కృష్ణ , దామలంక బూరయ్య , ముమ్మిడి బుజ్జి ,నక్క శ్రీనివాస్, గీసాల శ్రీనివాస్ , మసిమేని గంగయ్య , నెహ్రూ , కుర్ర నాగబాబు, జీని శ్రీనివాస్, తడాల అబ్బు , పాండ్రంకి రాజు , వినాయక్ , రెడ్డిపల్లి కిషోర్, గవర శ్రీరాములు , దొడ్డిపట్ల అప్పారావు , సూతి శ్రీనివాస్, యలమంచిలి భాస్కర్ , తాటిమళ్ల రమేష్ , గుమ్మడి వీరబాబు, రెడ్డిపల్లి లచ్చ, దెయ్యాల శ్రీనివాస్, అడప లక్ష్మణ్ , వసంత గోపాల్ , ఎల్లంకి సూరిబాబు, బండారు మణికంఠ, చింతలపూడి నాని , రాయుడు శ్రీనివాస్, అడప ఆదినారాయణ, పెన్నాడ శివ ప్రసాద్ , ఉండమట్ల తాతాజీ , రాయుడు దుర్గా ప్రసాద్ , నాగం రాంబాబు , చీకట్ల దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.