పయనించే సూర్యుడు జూలూరుపాడు రిపోర్టర్ గడిదేసి ప్రేమ్ జూన్ 6/26 నాయి బ్రాహ్మణులను వారి సామాజిక వర్గాన్ని కించపరిచే పదాల వాడకంపై తెలంగాణ ప్రభుత్వం నిషేధం విధించడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా నాయి బ్రాహ్మణ సేవా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి మంగళి మంగలోడా బొచ్చుగొరిగేవాడా మంగలిది కొండ మంగలి తదితర అవమానకర పదాలను ఉపయోగించడం ద్వారా నాయి బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసినట్లుగా పరిగణిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇలాంటి పదాలను ఉపయోగించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేయడంతో నాయి బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఆనందం వ్యక్తమవుతోంది ఈ నిర్ణయం నాయి బ్రాహ్మణుల ఆత్మగౌరవాన్ని పరిరక్షించే దిశగా కీలక అడుగుగా సంఘ నాయకులు అభివర్ణించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కడియాల సత్యనారాయణ మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులను కులం పేరుతో దూషించే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా జీవో జారీ చేయడంలో చొరవ చూపిన తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సామాజిక వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడే నిర్ణయం తీసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అట్లాగే గతంలో నాయి బ్రాహ్మణులకు టిఆర్ఎస్ ప్రభుత్వం బార్బర్ షాపులకు ఉచిత కరెంటు ఇచ్చినందుకు ఆ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపినాము ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మాకు ఇతర కులస్తులు మా వృత్తిని ఇతరులు కబ్జా చేయకుండా మా వృత్తిని మేమే చేసుకొనేటట్టుగా ప్రభుత్వం ఆలోచన చేసి వెంటనే మాకు ఒక జీవో విడుదల చేయాలని కోరుకుంటున్నాము ప్రభుత్వ నిర్ణయం వల్ల సమాజంలో పరస్పర గౌరవం పెంపొందుతుందని వివక్షపూరిత వ్యాఖ్యలకు అడ్డుకట్ట పడుతుందని నాయి బ్రాహ్మణ సేవా సంఘాల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు