నాలుగో సెమిస్టర్ ఫలితాలలో వాగ్దేవి మహిళా కళాశాల విద్యార్థినులు సంచలన విజయాన్ని నమోదు చేశారు. డిగ్రీ అన్ని గ్రూపుల్లో పట్టణ స్థాయిలోఅత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించి కళాశాల మరోసారి తన ప్రతిభను చాటుకుంది

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం మే 22 జగయ్యపేట్ట పట్టణంలోని ఈరోజు న కృష్ణా యూనివర్సిటీ విడుదల చేసిన డిగ్రీ ద్వితీయ సంవత్సరం నాలుగో సెమిస్టర్ ఫలితాలలో వాగ్దేవి మహిళా కళాశాల విద్యార్థినులు సంచలన విజయాన్ని నమోదు చేశారు. డిగ్రీ అన్ని గ్రూపుల్లో పట్టణ స్థాయిలో అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించి కళాశాల మరోసారి తన ప్రతిభను చాటుకుంది. బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & కంప్యూటర్స్ విభాగంలో హెచ్.టీ నేంబర్.వై.243224013 - శ్రీ గౌరీ 850 మార్కులకు గాను 833 మార్కులు సాధించి యూనివర్సిటీ టాపర్‌గా మరియు టౌన్ ఫస్ట్‌గా నిలిచింది. బీఎస్సీ మైక్రోబయాలజీ విభాగంలో .:హెచ్.టీ నేంబర్.వై.243224065 : త్రినశ 850 మార్కులకు గాను 732 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ స్థానాన్ని కైవసం చేసుకుంది. బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ విభాగంలో హెచ్.టీ నేంబర్. వై.243224049 : గీతిక 850 మార్కులకు గాను 779 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్‌గా నిలిచింది. బీకాం కంప్యూటర్స్ విభాగంలో హెచ్.టీ నేంబర్. వై.247224040 :సుప్రియ 750 మార్కులకు గాను 676 మార్కులు సాధించి టౌన్ ఫస్ట్‌ను సాధించింది. అలాగే బీఎస్సీ మ్యాథ్స్ విభాగంలో శ్రీ గౌరీ, అనూష, ప్రణీత, విజయలక్ష్మి, వాసవి, మమత, సత్య ప్రశాంతి, రోజా, ఇషిత తదితర పది మంది విద్యార్థినులు 100కు 100 మార్కులు సాధించి యూనివర్సిటీ గోల్డ్ మెడల్‌కు అర్హత పొందారు. బీఎస్సీ కంప్యూటర్స్ విభాగంలో పైథాన్ సబ్జెక్టులో స్వాతి, కటకం శిరీష, శ్రీ గౌరీ, గుమ్మా శిరీష, మమత, ఇషిత, మహితలు 100కు 100 మార్కులు సాధించి యూనివర్సిటీ గోల్డ్ మెడల్‌కు అర్హత సాధించారు. ఈ ఫలితాల్లో బీఎస్సీ విభాగంలో 80 శాతం ఉత్తీర్ణత, బీకాం విభాగంలో 82 శాతం ఉత్తీర్ణత సాధించి వాగ్దేవి మహిళా కళాశాల పట్టణంలో అగ్రగామిగా నిలిచింది. ఈ అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్, కరస్పాండెంట్ బుస్సా సరిత మరియు అధ్యాపక బృందం అభినందించారు.