నిరుద్యోగ కళాకారుల ఉపాధి కల్పనకు కృషి చేస్తా

"సిద్దిపేట జిల్లా నూతన అధ్యక్షుడిగా ఎరవెల్లి శ్రీనివాస్"

పయనించే సూర్యుడు జులై 8 రాజేష్ ) సిద్దిపేట జులై 08: తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా ఎరవెల్లి శ్రీనివాస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నిరుద్యోగ కళాకారుల సంక్షేమం, ఉపాధి అవకాశాల కల్పన కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సంఘాన్ని గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలోపేతం చేయడంతో పాటు సాంస్కృతిక సారథిలో కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షుడు దరువు అంజన్న, రాష్ట్ర చైర్మన్ అనువోజు వెంకన్న, రాష్ట్ర కార్యదర్శి పిన్నింటి దాసు, రాష్ట్ర కమిటీ సభ్యుడు శ్రీనివాస్ యాదవ్, జిల్లా నాయకుడు భుజంగం పరమేష్ రాజుతో పాటు సంఘంలోని నాయకులు, కళాకారులందరికీ ఎరవెల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కమిటీని కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ఉపాధ్యక్షులుగా తునికి రాజు, పాకాల భూపతి, ప్రధాన కార్యదర్శిగా పరమేష్, జిల్లా కార్యదర్శిగా పిల్లిట్ల భుజంగం, కోశాధికారిగా కందకట్ల రాజు, సంయుక్త కార్యదర్శులుగా బొల్లం రాజేష్, ధనరేఖ, ప్రచార కార్యదర్శిగా చిన్న గుండవెల్లి రాజు, గౌరవ అధ్యక్షుడిగా దుబ్బాక శ్యాంసుందర్, గౌరవ సలహాదారులుగా ఇనుప సురేష్, పిల్లిట్ల శశిధర్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పిల్లిట్ల విధమౌళి, ఉదయ్, కనకరాజు, రేణుక, పిన్నింటి బాబు, రమేష్, మల్లేశం, శ్రీనివాస్‌తో పాటు సుమారు 50 మంది కళాకారులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.