నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఓ వరం

పయనించే సూర్యుడు న్యూస్ మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండలం కొండాపూర్ గ్రామానికి చెందిన సిద్దిరములుకి చెక్ పంపిణీ చేసిన దుబ్బాక నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారి చొరవతో వచ్చిన 19000 రూపాయలు సి ఎం ఆర్ ఎఫ్ చెక్కును శ్రీనివాస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కోండి శ్రీనివాస్, చేగుంట మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మొజామిల్, అన్నం ఆంజనేయులు,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ నాయక్,సీనియర్ నాయకులు బాస రాజ్,తదితరులు పాల్గొన్నారు