పయనించే సూర్యుడు న్యూస్, జూన్06 (ఏలేశ్వరం మండల రిపోర్టర్ ఏ శివాజీ) : వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో శ్రీనివాస్ శ్యామల దంపతుల కుమార్తె నికిత పుట్టినరోజు సందర్భంగా వారి ఆర్థిక సాయంతో లింగంపర్తి గ్రామంలో నిరుపేద కుటుంబానికి బియ్యం బస్తా, నిత్యవసర సరుకులు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా మైరాల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎవరైనా పుట్టినరోజు, పెళ్లిరోజు తదితర కార్యక్రమాలు ఏమైనా ఉంటే మా సేవా సమితి ద్వారా నిరుపేదలకు ఆర్థిక సాయం చేయవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో వివేకానంద సేవాసమితి సభ్యులు పంతం పద్మనాభం, పెండ్యాల రాజు, అడపా శివప్రసాద్, నానాజీ తదితరులు పాల్గొన్నారు.