పయనించే సూర్యుడు న్యూస్ మే 23 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీల ను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందంటూ ఐకేపీ వివోఏలు మండిపడ్డారు. ఎన్నికల ముందు తమ సమ్మె శిబిరానికి వచ్చి న్యాయం చేస్తామని చెప్పిన నాయకులు ఇప్పుడు స్పందించకపోవడం బాధాకరమని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు రేవతి, కృష్ణకుమారి విమర్శించారు. అశ్వారావుపేట పట్టణంలోని పాత ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఐకేపీ వివోఏల ఆధ్వర్యంలో మహిళలు భారీగా సమ్మె నిర్వహించారు. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వివోఏలకు రూ.26 వేల కనీస వేతనం అమలు చేయాలని, ఎస్ఈఆర్పీ ఉద్యోగులుగా గుర్తించాలని, పదోన్నతులు కల్పించాలని, ఆరోగ్య భీమా, ట్యాబ్లు, నెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. జీవో 58లో మార్పులు చేయాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జయలక్ష్మి, సుజాత, మంగ, భవాని, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.