పయనించే సూర్యుడు న్యూస్ :జూలై 7,తల్లాడ రిపోర్టర్ బాబురావు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఓటర్ నమోదు ప్రక్రియ (సర్) కార్యక్రమంలో భాగంగా తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలో గ్రామంలో ఓటర్ నమోదు ప్రక్రియ పై అవగాహన కార్యక్రమాన్నిసోమవారం కాంగ్రెస్ పార్టీ సత్తుపల్లి నియోజకవర్గం బిఎల్ఎ ఇంచార్జ్ రాయల రాము నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఓటు నమోదు ప్రక్రియ ఎలా చేపట్టాలనే దానిపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. ఓటు నమోదు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఎటువంటి పొరపాట్లు జరగకుండా నిబంధనల ప్రకారం ఖాళీలను పూరించిఅధికారులకు అందజేయాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి , గ్రామస్తులు, బూతు లెవల్ నాయకులు పాల్గొన్నారు.