నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ : 1,తల్లాడ రిపోర్టర్ అన్నారుగూడెం గ్రామానికి చెందిన ఇస్నాపల్లి రజిని ---వెంకన్న (లేట్ )దంపతుల నూతన గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం అన్నారుగూడెం గ్రామంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి గోవింద్ శ్రీనివాసరావు, అన్నారుగూడెం మాజీ సర్పంచ్ మారెళ్ళ మమత, మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి సత్యవతి,మాజీ వీడిసి చైర్మన్ మారెళ్ల మల్లికార్జునరావు, తల్లాడ మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మలపల్లి రమేష్, అన్నారుగూడెం మాజీ ఎంపీటీసీ తాళ్ల జోసెఫ్ హాజరై నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పేదల సంక్షేమ ధ్యేయంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. పేదవాడి సొంతింటి కలను నెరవేర్చే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇళ్లను లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తున్న సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ళను ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ గారి సహకారంతో గ్రామంలో లబ్ధిదారులకు అందే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కుటుంబ సభ్యులు శాలవాలతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గొడ్ల కిసింది, కొత్తపల్లి ప్రభాకర్ రావు, సాగరు, కొత్తపల్లి వెంకటయ్య, సూద వెంకటేశ్వర్లు వార్డు మెంబర్ ముత్తయ్య, తాళ్లూరి వెంకటేశ్వర్లు, యూత్ కాంగ్రెస్ నాయకులు విజయ్ రాకేష్, కుటుంబ సభ్యులు కార్యకర్తలు పాల్గొన్నారు