పయనించే సూర్యుడు జూన్ 2. పాపన్నపేట మండలం రిపోర్టర్ దుర్గాప్రసాద్ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో పాపన్నపేటకు రెండు నూతన బోరు మోటర్లు వచ్చినట్లు పాపన్నపేట సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ తెలిపారు. సోమవారం గ్రామం లోని బుడగ జంగం కాలనీలో వార్డు సభ్యులతో కలిసి ఆమె బోరు మోటరు ను ప్రారంభించారు. నీటి సరఫరా కావడంతో కాలనీ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్, వార్డు సభ్యులు, నాయకులు..శ్రీను, శ్రీరామ్ దుర్గయ్య, చోటు, రాజు, కిష్టయ్య, దోసని సంగమేశ్వర్, శివయ్య, ప్రవీణ్ గౌడ్, పోచయ్య,తదితరులు పాల్గొన్నారు.