పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 5: (సింగరేణి రిపోర్టర్ నరేష్) మండల పరిధిలోని మాణిక్యారం గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ భూక్య రంగారావు - సోని ల కుమారుడు వివాహానికి వైరా మాజీ ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ గారు హాజరై నూతన వధూవరులు ఈశ్వర్, సాయి ధనశ్రీ లను ఆశీర్వదించారు. అనంతరం గాదేపాడు మాజీ ఎంపీటీసీ భూక్య జామ్లా సోని లను ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈకార్యక్రమంలో వైరా మాజీ జడ్పీటీసీలు వాంకుడొత్ జగన్, ఉన్నం వీరేందర్, మాజీ వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, ఇల్లందు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ వాంకుడొత్ నరేష్, మాజీ సర్పంచ్ కుర్సం సత్యనారాయణ, నాయకులు అజ్మీర వీరన్న, అడపా పుల్లారావు, పత్తి బాబు, బాణోత్ కోటి, వాంకుడొత్ సతీష్, లంబాడి సంఘం మహిళ నాయకురాలు సుశీల బాయి తదితరులు పాల్గొన్నారు.